సీత‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,January 26, 2019 11:15 AM
sita first look revealed

నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మంచి హిట్ కొట్టిన తేజ ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సీత అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న చిత్రానికి సంబంధించి టైటిల్ లోగో విడుద‌ల చేసిన యూనిట్ తాజాగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా విడుద‌లైన చిత్ర ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. శిర్షా రే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాలో కాజ‌ల్‌ని ల‌క్ష్మీగా ప‌రిచ‌యం చేసిన తేజ తాజా చిత్రంలో సీత‌గా చూపించ‌నున్నాడ‌ట‌. ఈ సినిమా కాజ‌ల్ కెరియ‌ర్‌లో మ‌రో మంచి హిట్ అవుతుందని యూనిట్ భావిస్తుంది. బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంట‌గా వ‌చ్చిన‌ ‘కవచం’ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌గా రెండో సారి వీరిద్ధ‌రు క‌లిసి న‌టిస్తున్నారు. ఈ మూవీ మంచి హిట్ కొట్టాల‌ని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

3698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles