సిట్ ఎదుట హ‌జ‌రైన అక్ష‌య్ కుమార్

Wed,November 21, 2018 10:27 AM
SIT to question Akshay Kumar

బాలీవుడ్ అక్ష‌య్ కుమార్ తాజాగా ఛండీఘ‌ర్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ముందు హాజ‌ర‌య్యారు. 2015లో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించిన కేసులో అక్షయ్‌ కుమార్‌కు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌, డిప్యూటీ సీఎం సుఖ్‌‌బీర్ సింగ్‌కు సమన్లు జారీ అయిన సంగ‌తి తెలిసిందే . బాదల్ వర్గానికి, గుర్మిత్ రామ్ రహీం సింగ్‌ అలియాస్ డేరా బాబాకు మధ్య అక్షయ్ కుమార్ మధ్యవర్తిత్వం జరిపారనే ఆరోపణలపై సమన్లు జారీ చేశారు. ఈ వ్యవహారంలో అక్షయ్‌ని నవంబర్ 21న విచారణకు హాజరుకావాలని పంజాబ్ పోలీసులు ఆదేశించారు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న సిట్ ముందు హాజ‌ర‌య్యాడు. గత జనవరిలో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదమైంది. రామ్ రహీం మా పక్క ఇంట్లో దిగాడు అంటూ ట్వింకిల్ ట్వీట్ చేసింది. ఇది వివాదాస్ప‌ద‌మైంది. అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్ తానుంటున్న ప్రదేశంలో ఎప్పుడూ నివసించలేదు అని అక్షయ్ ఓ స్టేట్‌మెంట్‌లో తెలియ‌జేశాడు. అయితే సిట్ అక్ష‌య్‌ని ఏఏ విష‌యాల‌పై ప్ర‌శ్నిస్తుందో, దానిపై ఆయ‌న ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇస్తాడో అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

1395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles