ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్

Tue,March 21, 2017 11:07 AM
sirish says thanks to fans

సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ దువ్వాడ జగన్నాథమ్. గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఫిబ్రవరి 23న విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటలలోనే టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది. కేవలం లైక్స్ విషయంలోనే కాక డిస్ లైక్స్ విషయంలోను డీజే దూసుకెళ్ళింది. తాజాగా ఈ చిత్ర టీజర్ పది మిలియన్ వ్యూస్ సాధించడంతో బన్నీ తన ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పటి వరకు తెలుగులో కాటమరాయుడు చిత్ర టీజర్ కి మాత్రమే కోటి వ్యూస్ దక్కగా, ఆ తర్వాతి స్థానంలో దువ్వాడ జగన్నాథమ్ టీజర్ నిలిచింది. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. ప్రస్తుతం డీజే మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది. చిత్రంలో బన్నీ సాంప్రదాయ హిందూ బ్రాహ్మణుడి వేశధారణలో కనిపించనున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.


1762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles