సూర్య సినిమా నుండి అల్లు హీరో అవుట్‌

Sat,July 21, 2018 10:28 AM
sirish out from suriya 37 movie

కెరీర్‌లో ఆచితూచి అడుగులేస్తున్న అల్లు శిరీష్ ప్ర‌స్తుతం మ‌ల‌యాళ రీమేక్ చిత్రం ఎబిసిడి (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ) చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ చిత్రం ఎబిసిడి (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ) ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుండ‌గా ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర’ శ్రీధర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూఎస్ నుండి విహార యాత్ర‌కి ఇండియాకి వ‌చ్చిన ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి త‌న జీవితంలో ఎదురైన సంఘ‌ట‌ల‌ని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాడ‌నేది సినిమాలో ఆస‌క్తికరంగా చూపించ‌నున్నార‌ట‌ . ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి మెప్పించిన రుక్స‌ర్ థిల్లాన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

అల్లు శిరీష్.. సూర్య 37వ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఎంపికైన సంగ‌తి తెలిసిందే. కేవీ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే తాను చేస్తున్న ఏబీసీడీ, సూర్య 37 చిత్రాల‌కి డేట్స్ స‌ర్ధుబాటు చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న సూర్య మూవీ నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు శిరీష్‌. త‌న ప‌రిస్థితిని ద‌ర్శ‌కులు అర్ధం చేసుకున్నార‌ని, సూర్య సార్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ మ‌రోసారి రావాల‌ని కోరుకుంటున్నా అంటూ శిరీష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


2232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles