మీటూ ఎఫెక్ట్: అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌న్న మ‌రో సింగ‌ర్‌

Sun,October 14, 2018 09:13 AM
singer sunitha sarathy mee to talks goes viral

ఇండియాలో మీటూ ఉద్య‌మం ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లైంగిక వేధింపుల గురించి బాధిత మ‌హిళ‌లు నిర్భయంగా సోష‌ల్ మీడియాలో బ‌య‌ట‌పెడుతుండ‌గా, తాజాగా సింగ‌ర్ సునీత సార‌థి త‌న జీవితంలోని ప‌లు ద‌శ‌ల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ని వివ‌రిస్తూ ఫేస్ బుక్ పేజీలో పెద్ద పోస్ట్ పెట్టింది. చిన్న‌ప్ప‌టి నుండే లైంగిక దాడులు జ‌రుగుతున్నాయ‌ని, నా పోస్ట్ వ‌ల‌న కొంద‌రు మ‌హిళ‌ల‌కి ధైర్యం వస్తుంద‌ని ఈ విష‌యాలు షేర్ చేసుకుంటున్నాను.

నాలుగైదేళ్ల వ‌య‌స్సులో మా అమ్మ వాళ్ల సోద‌రుడు మా ఇంటికి వ‌చ్చి నన్ను బెడ్ రూంలోకి తీసుకెళ్లి ముద్దులు పెట్టి, అస‌భ్యంగా తాకుతూ వేధించేవాడు. నన్ను ప్రేమ‌గా చూసుకుంటున్నాడ‌ని అంద‌రు భావించేవారు. కాని కొన్నేళ్ళ త‌ర్వాత ఆయ‌న వికృత చేష్ట‌లు అర్ధ‌మై నిర్ఘాంత‌పోయాను. ఇక మా అమ్మ స‌హోద్యోగి కూడా న్ను వేధించేవాడు. నన్ను ఎత్తుకొని ఆడించిన‌ట్టు చేస్తూ వికృత చేష్ట‌లు చేసేవాడు. అత‌నిని నేను ఎంత‌గానో అస‌హ్యించుకునే వాడిని. ఓ రోజు మా ఇంటికి వ‌చ్చిన అత‌ని ద‌గ్గ‌ర‌కి లాక్కొని లిప్ లాక్ ఇచ్చాడు. వ‌దిలించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ముఖంపై ముద్దులు పెడుతూ రాక్ష‌సానందం పొందాడు. వెంట‌నే బాత్ రూంకి వెళ్లి ముఖం నోరు క‌డుక్కొని వ‌చ్చాను.

లైంగిక బాధితుల త‌ర‌పున మాట్లాడుతున్న‌సింగర్ చిన్మయి నాకు స్నేహితురాలు కాక‌పోయిన ఆమె జీవితంలో చేదు ఘ‌ట‌న‌లు ఎలా జ‌రిగాయో, నాకు అలానే జ‌రిగాయి. మ‌హిళ‌లు క‌లిసి ముందడుగు వేయాల్సిన స‌మ‌యం ఆసన్న‌మైంది. మీటూ వ‌ల‌న నా బాధ‌ని అంద‌రితో పంచుకునే అవ‌కాశం ల‌భించింది. నిజాన్ని నిర్భ‌యంగా చెబుతూ వెకిలి చేష్ట‌లు చేసేవాళ్ల‌కి క‌ఠిన శిక్ష ప‌డేలా ఆలోచ‌న‌లు చేయాలి. మగవాళ్లు కూడా మాకు మద్దతు తెలిపితే నీచులకు శిక్ష పడేలా చేయవచ్చునంటూ’ సింగర్ సునితా సారథి పోస్ట్‌లో తెలిపింది.

4535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles