రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగ‌ర్ సునీత‌

Fri,July 20, 2018 10:24 AM
singer sunitha clarifies on her second marriage

సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర సీమ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకుంది సునీత‌. కొన్నేళ్ల నుండి సుమ‌ధుర గానంతో అల‌రిస్తున్న సునీత‌కి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. కొన్ని కార‌ణాల వ‌ల‌న మొద‌టి భర్త నుండి విడిపోయిన సునీత‌, త్వ‌ర‌లో రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై త‌న ఫేస్ బుక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది సునీత‌. మీ ఆద‌ర‌ణ వ‌ల‌న ఇప్ప‌టికి హ్యాపీగా పాట‌లు పాడుకుంటూ ఉన్నాను. కాని నిన్న‌టి నుండి నేను రెండో పెళ్ళి చేసుకోబోతున్న‌ట్టు నా ఫోన్‌కి మెసేజ్‌లు వ‌స్తున్నాయి. దాదాపు అన్నీ వెబ్ సైట్స్ నేను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు రాసాయి. కాని ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మీ అంద‌రి ఆద‌ర‌ణ వ‌ల‌న హ్యాపీగా ఉన్నాను. ప్ర‌స్తుతానికి పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు. భ‌విష్య‌త్‌లో ఏదైన ఉంటే త‌ప్ప‌కుండా మీకు నేను చెబుతాను. ఈ టైంలో ఇలాంటి వ‌దంతులు సృష్టించ‌డం స‌రికాదు అంటూ సునీత వీడియోలో తెలిపారు. ప్ర‌స్తుతం సునీత త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటుంది. సునీత పూర్తి వివ‌ర‌ణ‌పై కింది వీడియో చూడండి.


3203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS