సిద్ శ్రీరామ్ వాయిస్ కు అందరూ ఫిదా

Mon,September 30, 2019 05:21 PM

‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ సాగే ఈ పాట ఇపుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. అల వైకుంఠపురంలో..చిత్రంలో థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను యువ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడాడు. మ్యూజిక్ లవర్స్ ఇపుడు ఈ పాట వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 2 రోజుల కింద విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో అందరినీ అలరిస్తోంది.


ఇవే కాకుండా సిద్ శ్రీరామ్ పాడిన ఉండిపోరాదే..గుండె నీదేలే (హుషారు), ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..చాలే ఇది చాలే (గీత గోవిందం), పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే (టాక్సీవాలా), ఏమై పోయాయే నీ వెంటె నేనుంటే (పడి పడి లేచె మనసు), నువ్వుంటే నా జతగా (ఐ) పాటలు ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సిద్ శ్రీరామ్ హిట్ సాంగ్స్ లో కొన్ని..
4696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles