లైంగిక ఆరోప‌ణ‌ల కేసులో సింగ‌ర్‌కు అరెస్టు వారెంట్‌

Sat,February 23, 2019 12:00 PM
Singer R Kelly charged with sexual abuse in Chicago

చికాగో: అమెరికా గాయ‌కుడు ఆర్ కెల్లీపై లైంగిక నేరారోప‌ణ రుజువైంది. ఆర్ అండ్ బీ స్టార్.. రాబ‌ర్ట్ సిల్వ‌స్ట‌ర్ కెల్లీపై గ‌త కొన్నేళ్లుగా లైంగిక ఆరోప‌ణ‌ల కింద కేసు విచార‌ణ జ‌రుగుతున్న‌ది. అయితే గ‌తంలో అత‌ను దోషిగా తేల‌లేదు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను అత‌ను కొట్టిపారేశాడు. అయితే తాజాగా చికాగో కోర్టు.. రేప్ కేసులో అత‌న్ని దోషిగా తేల్చింది. దీంతో అరెస్టు వారెంట్ జారీ చేశారు. కోర్టు తీర్పుతో త‌న క్లయింట్ తీవ్ర నిరాశ‌కు, డిప్రెష‌న్‌కు గురైన‌ట్లు కెల్లీ న్యాయ‌వాది తెలిపారు. సింగ‌ర్ కెల్లీ త‌న కెరీర్‌లో అనేక మంది మ‌హిళ‌ల‌ను వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌న క‌న్నా చిన్న వ‌య‌సు ఉన్న అమ్మాయిల‌ను వేధించిన‌ట్లు కేసులు కూడా న‌మోదు అయ్యాయి. 13 నుంచి 16 ఏళ్ల వ‌య‌సున్న అమ్మాయిల‌ను శారీర‌కంగా వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వేధింపుల కేసులో కెల్లీకి ఏడేళ్ల శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని స్థానిక అటార్నీ తెలిపారు. ఇటీవ‌ల కెల్లీపై ఓ డాక్యుమెంట‌రీ ప్ర‌సార‌మైంది. ఆ త‌ర్వాత అత‌నిపై ఆరోప‌ణ‌లు మ‌రింత వెల్లువెత్తాయి. బాధితులు త‌మ వేద‌న‌ను వినిపించేందుకు ముందుకు వ‌చ్చారు. ఓ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్న వీడియో టేపు బ‌య‌ట‌కు రావ‌డంతో కెల్లీని కోర్టు దోషిగా తేల్చింది.

2039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles