గాయకుడు కె.బి.కె మోహనరాజు కన్నుమూత

Fri,March 16, 2018 10:42 PM
Singer K.B.K Mohan Raju passed away

హైదరాబాద్‌: అలనాటి తెలుగు సినీ నేపథ్య గాయకుడు కొండా బాబూ కృష్ణ మోహనరాజు(84) సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. 1934లో విజయవాడలో జన్మించారాయన. మోహనరాజుకు నలుగురు కుమారులు. ఓ కూతురు ఉన్నారు. 1960-70 దశకంలో తెలుగులో పలు సినీ గీతాలను ఆలపించారు. 1968లో వచ్చిన పూలరంగడు సినిమాలోని చిగురులు వేసిన కలలన్నీ పాట నేపథ్య గాయకుడిగా ఆయనకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది.

తన సినీ ప్రయాణంలో బాపూజీ మన బాపుజీ(విధివిలాసం), అన్న వదినా( పెద్దన్నయ్య), ఎవరికి వారే ఈ లోకం(సాక్షి), మరు మల్లెలు(పెళ్లి కాని పెళ్లి), ప్రేమించే మనసొకటుంటే( మహాత్ముడు), పొడలా పొడలా గట్ల నడుమా(మా భూమి), రాధను నేనైతే (ఇన్‌స్పెక్టర్ భార్య)తో పాటు పలు సినిమాల్లో వందకుపైగా అర్థవంతమైన గీతాలను ఆలపించారు మోహనరాజు.

ఆల్ ఇండియా రేడియో, సినిమా, దూరదర్శన్‌లలో తన గళంతో ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల్ని ఆలరించారు. గాయనీగాయకులతో ఎంతో సన్నిహితంగా ఉండే మోహనరాజు మరణం సంగీతప్రపంచానికి తీరని లోటని చిత్ర ప్రముఖులు తెలిపారు. తండ్రి బాటలోనే ఆయన కూతురు వీణ గాయనిగా పేరుతెచ్చుకున్నారు.

1971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles