విలనిజం పండిస్తానంటున్న సీనియర్ హీరోయిన్

Wed,June 21, 2017 03:43 PM
simran plays a villain role

సిమ్రాన్ .. ఈ పేరుని అప్పటి యూత్ ఎంతగానో కలవరించేవారు. తన అందచందాలతో, వైవిధ్యమైన నటనతో కుర్ర కారు గుండెల్లో రైళ్ళు పరుగులెత్తించిన సిమ్రాన్ కొన్నాళ్లుగా వెండితెరపై అంతగా సందడి చేయడం లేదు. అడపాదడపా కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికి వాటితో అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సారి మాత్రం ఓ పవర్ ఫుల్ రోల్ లో సిమ్రాన్ తన అభిమానులకు మంచి కిక్ ఇచ్చేందుకు సిద్ధమైందట. తమిళ డైరెక్టర్ పొణరామ్ .. శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సిమ్రాన్ ని విలన్ గా చూపించనున్నాడట. ఈ పాత్ర కోసం సిమ్రాన్ తమిళ్‌ మార్టియల్ ఆర్ట్ సీలంబమ్ (కర్రసాము) కూడా నేర్చుకుంటుందట. ఇక సిమ్రాన్ కి జోడిగా మలయాళ నటుడు లాల్ నటిస్తుండగా, శివ కార్తికేయన్ ఫాదర్ గా నెపోలియన్ కనిపించనున్నాడు. ఇక ప్రేక్షకులని నవ్వించేందుకు తమిళ నటుడు సూరి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో అందరి నటన ఎంత వినోదాన్ని పండించిన సిమ్రాన్ మాత్రం ఈ సినిమాకే హైలైట్ కానుందని మేకర్స్ అంటున్నారు.

1316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS