ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న సిమ్రాన్‌..!

Wed,May 23, 2018 11:26 AM
Simran In Karthik Subbaraj-Rajinikanth tamil Movie

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా చ‌ల‌మాణీ అయిన సిమ్రాన్ టాప్ స్టార్స్ అంద‌రి స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి స్టార్స్‌తో న‌టించిన సిమ్రాన్ తన అందచందాలతో పాటు వైవిధ్యమైన నటనతో కుర్ర కారు గుండెల్లో రైళ్ళు పరుగులెత్తించింది. ఈ మ‌ధ్యే త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కి రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ డైరెక్టర్ పొణరామ్ ద‌ర్శ‌క‌త్వంలో శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో రూపొందుతున్న‌ సినిమాలో సిమ్రాన్ న‌టిస్తుంది. ఇందులో విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అయితే ఇప్పుడు ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న నటించే గొప్ప ఛాన్స్ ఈ అమ్మ‌డికి ద‌క్కింద‌ని కోలీవుడ్ టాక్. ర‌జ‌నీ త్వ‌ర‌లో కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో త‌న 168వ సినిమా చేయ‌నున్నాడు.

స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంతో సిమ్రాన్ తొలి సారి ర‌జ‌నీకాంత్‌తో జ‌త‌క‌ట్ట‌నుంద‌ని టాక్‌. కార్తీక్ సుబ్బరాజు గ్యాంగ్ స్ట‌ర్ మూవీగా రూపొందించ‌నున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే సిమ్రాన్ ఓ తెలుగు సినిమాలో స‌పోర్టింగ్ రోల్ చేస్తుంద‌ని టాక్. సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి ఓ సినిమా తెర‌కెక్కించ‌నున్నాడు. ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథగా తెలుస్తుంది. ఇందులో సిమ్రాన్ అత్త‌గా న‌టిస్తుంద‌ట . వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమాలో సిమ్రాన్ పాత్ర‌కి మంచి గుర్తింపు ఉంటుంద‌ట‌. అందుకే సిమ్రాన్ ఈ సినిమాకి సైన్ చేసింద‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

2447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS