'టెంప‌ర్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Thu,December 7, 2017 12:18 PM
simmba first look revealed

తెలుగులో ఎన్టీఆర్‌, కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన టెంపర్ చిత్రం హిందీలో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రం 2018 ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుందని టాక్ . ఇక ఈ మూవీని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 28న‌ విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారం. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించ‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్‌ని సెల‌క్ట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. తెలుగులో టెంప‌ర్ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా, హిందీలో థ‌మ‌న్‌తో చేయించాల‌నే భావ‌న‌లో టీం ఉంద‌ని తెలుస్తుంది. తాజాగా హిందీ రీమేక్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్ . హిందీలో సింబా అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుండ‌గా, ఇందులో ర‌ణ్‌వీర్ సంగ్రామ్‌ భలేరావ్‌ పాత్రలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్‌ఎస్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

2009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS