అభిమానులు శాంతంగా ఉండాల‌ని కోరిన హీరో

Thu,November 15, 2018 08:49 AM
Simbu Request To His Fans

త‌మిళ హీరో శింబుకి వివాదాలేమి కొత్త కాదు. గ‌తంలో ఆయ‌న‌ని అనేక వివాదాలు చుట్టు ముట్టిన అన్నింటిని సానుకూలంగా ప‌రిష్కరించుకుంటూ వ‌స్తున్నాడు. శింబు ప్ర‌స్తుతం అత్తారింటికి దారేది చిత్ర రీమేక్ వంత రాజ‌వ‌తాన్ వ‌రువెన్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ శింబు, అన్భ‌న‌వ‌న్ అస‌ర‌ద‌వ‌న్ అద‌న్గద‌వ‌న్ (అఅఅ) చిత్ర నిర్మాత‌ల మ‌ధ్య కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల‌న ఆగిపోయింది. ఈ క్ర‌మంలో శింబు అభిమానులు అఅఅ చిత్ర నిర్మాత‌ల‌పై త‌మ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైర్ అవుతున్నారు. దీనిపై స్పందించిన శింబు అభిమానుల‌కి ప‌లు సూచ‌న‌లు చేశారు. మీరు అంద‌రు శాంతిని కొన‌సాగించాలి. మ‌నని ద్వేషిస్తున్న వారి ప‌ట్ల ప్రేమ‌ను విస్త‌రించాల‌ని ఆయ‌న కోరారు. మా మ‌ధ్య ఉన్న స‌మ‌స్య చ‌ట్ట‌బ‌ద్ధంగా అతి త్వ‌ర‌లోనే స‌మ‌సి పోతుంది. అంత వ‌ర‌కు ఓపిక ప‌ట్టండ‌ని శింబు అభిమానుల‌ని ఉద్ధేశించి మాట్లాడాడు. శింబు న‌టిస్తున్న అత్తారింటికి దారేది రీమేక్ చిత్రం సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, హిప్ హాప్ త‌మీజా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మిస్తుంది.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS