త‌మిళంలో రీమేక్ కానున్న అత్తారింటికి దారేది ?

Tue,August 14, 2018 10:17 AM
simbu remakes Attarintiki Daaredi

ప‌వ‌ర్ స్టార్ కళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అత్తారింటికి దారేది చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌టి భారీ విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న్క‌ర్లేదు. సెంటిమెంట్‌, కామెడీ, ఎమోష‌న్స్‌తో కూడిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడుఈ చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ రీమేక్ తెర‌కెక్క‌నుండ‌గా, ప‌వ‌న్ పాత్ర‌ని శింబు చేయ‌నున్నాడ‌ట‌. తొలిసారి సుంద‌ర్‌- శింబు జ‌త‌క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే తెలుగు వ‌ర్షెన్‌లో నదియా పోషించిన ‘సునంద’(అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషిస్తున్నారని సోషల్‌మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఈ వార్త‌ చూసి కుష్బూ షాక్‌ అయ్యారు. ‘‘అసలు నాకు ఈ విషయం తెలియదు.. ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి వార్తలు’’ అని అన్నారు. మ‌రి అత్తారింటికి దారేది త‌మిళ రీమేక్‌పై అఫీషియ‌ల్ క‌న్ష‌ర్మేష‌న్ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

1587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles