'అత్తారింటికి దారేది' రీమేక్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tue,November 6, 2018 10:05 AM

ప‌వ‌ర్ స్టార్ కళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అత్తారింటికి దారేది చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌టి భారీ విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న్క‌ర్లేదు. సెంటిమెంట్‌, కామెడీ, ఎమోష‌న్స్‌తో కూడిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ రీమేక్ తెర‌కెక్కుతుండ‌గా, ప‌వ‌న్ పాత్ర‌ని శింబు చేస్తున్నాడు . తొలిసారి సుంద‌ర్‌- శింబు జ‌త‌క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్ అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేయ‌గా, ఇందులో శింబు చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. తెలుగు వ‌ర్షెన్‌లో నదియా పోషించిన ‘సునంద’(అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషిస్తున్నారని సోషల్‌మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మిస్తుంది. చిత్రంలో క‌థానాయిక‌లు ఎవ‌రు, తెలుగులో ప‌వ‌న్ తాత( బొమ‌న్ ఇరానీ) పాత్ర‌ని త‌మిళంలో ఎవ‌రు పోషించ‌నున్నారు త‌దిత‌ర అంశాల‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇటీవ‌ల ఈ చిత్రం జార్జియాలో లాంగ్ షెడ్యూల్ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.

5306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles