ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌తో అద‌ర‌గొట్టిన 'సిల్లీ ఫెల్లోస్‌'

Sun,September 2, 2018 08:19 AM
Silly Fellows Promotional Video Song released

కొన్నాళ్ళుగా స‌రైన హిట్స్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ హీరోలు సునీల్‌, అల్ల‌రి న‌రేష్ క‌లిసి న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం సిల్లీ ఫెల్లోస్. భీమినేని శ్రీనివాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. . హీరోయిజంతో పాటు కామెడీని కలగలిపి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమా పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిత్రంలో కథానాయికలుగా పూర్ణ, చిత్ర శుక్లా, నందిని రాయ్‌లు న‌టిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై క్రేజ్ పెంచేలా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. తాజాగా ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఇది ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. శ్రీ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించారు. అల్లరి నరేశ్ .. సునీల్ కాంబినేషన్లో 'తొట్టి గ్యాంగ్' సినిమా వచ్చింది. ఆ సినిమాలో అల్లరి నరేశ్ హీరో అయితే .. సునీల్ కమెడియన్‌గా నటించిన విషయం విదితమే. మ‌రి ఈ సినిమాలో ఇద్ద‌రు ప్ర‌ధాన పాత్ర‌ల‌లోనే నటించ‌గా, ఎంత మేర‌కు ఆకట్టుకుంటారో చూడాలి.

2680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles