'సిల్లీ ఫెల్లోస్' స్టంట్ చూశారా..!

Thu,August 23, 2018 11:57 AM
Silly Fellows Movie Motion Teaser

అల్ల‌రి న‌రేష్‌, సునీల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో భీమినేని శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీ స్టార‌ర్ మూవీ సిల్లీ ఫెల్లోస్ . హీరోయిజంతో పాటు కామెడీని కలగలిపి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమా పై అభిమానుల‌లో భరీ అంచ‌నాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుండ‌గా, మేక‌ర్స్ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. తాజాగా చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. బైక్‌ పైన వెళుతున్న నరేష్‌, గాల్లో వేలాడుతున్న‌ సునీల్ మధ్య జరిగే సంభాషణతో ఈ టీజర్‌ను డిజైన్‌ చేశారు. ఇది అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. కొన్నాళ్ళుగా స‌రైన హిట్స్ లేని హీరోలు సునీల్‌, అల్ల‌రి న‌రేష్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ హోప్స్ పెట్టుకున్నారు. చిత్రంలో కథానాయికలుగా పూర్ణ, చిత్ర శుక్లాలు న‌టిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గతంలో అల్లరి నరేశ్ .. సునీల్ కాంబినేషన్లో 'తొట్టి గ్యాంగ్' సినిమా వచ్చింది. ఆ సినిమాలో అల్లరి నరేశ్ హీరో అయితే .. సునీల్ కమెడియన్‌గా నటించిన విషయం విదితమే. ప్ర‌స్తుతం సునీల్ హీరోగానే కాక క‌మెడీయ‌న్‌గా ప‌లు సినిమాల‌లో న‌టిస్తున్నాడు. అల్ల‌రి న‌రేష్ మ‌హ‌ర్షి సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం విదిత‌మే.

1795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles