సిల్క్ స్మిత నటించిన చివరి సినిమా రిలీజ్‌కు రెడీ

Mon,September 17, 2018 06:19 PM

దివంగత సెక్సీ స్టార్ సిల్క్ స్మిత నటించిన చివరి చిత్రం ఇప్పుడు రిలీజ్ కానున్నది. టాలీవుడ్ హీరోయిన్ స్మిత 1996లో మరణించింది. 23 ఏళ్ల క్రితం ఆమె నటించిన ఓ తమిళ చిత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిల్క్ చనిపోయేముందు రాగ తలంగల్ అనే తమిళ సినిమా చేసింది. ఈ ఫిల్మ్ నిర్మాణం 1995లోనే పూర్తి అయ్యింది. కానీ ఆ చిత్రంలో వివాదాస్పద అంశాలు ఉన్న కారణంగా దాన్ని రిలీజ్ చేయలేదు. అయితే ఆ చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఆ సినిమాకు కొన్ని మార్పులు చేసి దాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటమ్ డ్యాన్సర్‌గా గుర్తింపు ఉన్న సిల్క్ స్మితపై తమిళ డైరక్టర్ వెబ్ సిరీస్‌ను తీసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌తో కబాలి, కాలా సినిమాలు తీసిన పా రంజిత్ .. సిల్క్ స్మితపై వెబ్ సిరీస్‌కు ప్లాన్ వేసినట్లు ప్రకటించాడు.

7134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles