దీప్‌వీర్ పెళ్లిపై వివాదం ..!

Tue,November 20, 2018 08:51 AM
Sikh body upset over Anand Karaj performed outside gurdwara

బాలీవుడ్ ల‌వ‌బుల్ క‌పుల్ ర‌ణ్‌వీర్ సింగ్‌- దీపికా ప‌దుకొణేలు నవంబ‌ర్ 14న కొంక‌ణీ సంప్ర‌దాయంలో, 15న సింధీ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకొని ఒక్క‌ట‌య్యారు. ఇట‌లీలోని లేక్ కోమో వేదిక‌గా జ‌రిగిన వీరి వివాహం హాట్ టాపిక్ అయింది. అభిమానులు, సెల‌బ్రిటీలు ప్ర‌తి ఒక్క‌రు రెండు మూడు రోజుల పాటు వీరి పెళ్ళి గురించే మాట్లాడుకున్నారు. ఈ ఆదివారం ముంబై చేరుకున్న ఈ జంట ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. అయితే వీరి వివాహంపై చెల‌రేగిన వివాదం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేలా క‌నిపిస్తుంది. దీప్ వీర్ వివాహం త‌ర్వాత నిర్వ‌హించిన ‘ఆనంద్ కరాజ్’ అనే కార్య‌క్ర‌మం సంప్ర‌దాయ బ‌ద్దంగా జ‌ర‌గ‌లేద‌ని ఇటాలియ‌న్ సిక్ ఆర్గ‌నైజేష‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. సిక్కు సంప్ర‌దాయాల‌కి విరుద్దంగా ఆ కార్య‌క్ర‌మం జ‌రుగ‌గా, సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మరీ దానిని నిర్వహించారని పేర్కొంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదని, కాని వారు ఆ నియమాన్ని ఉల్లంఘించారని పేర్కొంది. ఈ విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు సంస్థ అధ్యక్షుడు తెలిపారు. ఈ విష‌యాన్ని ఐదుగురు మత గురువుల వద్దకు విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు అకల్ తఖ్త్ జతేదార్ తెలిపారు. మ‌రి ఈ వివాదంపై దీపికా, ర‌ణ్‌వీర్‌లు ఏమైన స్పందిస్తారేమో చూడాలి.

2401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles