సైమా ఏడ‌వ ఎడిష‌న్ నామినేష‌న్స్ విడుద‌ల‌.. ఉత్త‌మ న‌టుడు?

Tue,August 7, 2018 09:54 AM
siima nominations released

ద‌క్షిణాది తార‌లంతా ఒకే చోట చేరి సంద‌డి చేసే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ సైమా (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ ) వేడుక ప్ర‌తి సంవ‌త్స‌రం అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కి సంబంధించిన సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కి హాజ‌రు కానున్నారు. న‌టీమ‌ణుల గ్లామ‌ర్ తో , రాక్ ప‌ర్ఫార్మెన్స్ తో, సెల‌బ్రిటీల ఆట పాట‌ల‌తో సైమా వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎడిష‌న్స్ పూర్తి చేసుకున్న సైమా ఈ ఏడాది దుబాయ్‌లో ఏడో ఎడిష‌న్ జ‌రుపుకోనుంది. సెప్టెంబ‌ర్ 14, 15వ తేదీల‌లో సైమా వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. అయితే తాజాగా 2017 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల‌కి సంబంధించి నామినేష‌న్స్ ప్ర‌క‌టించారు. ఇందులో తెలుగోడి ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఏకంగా 12 విభాగాల్లో నామినేషన్లను దక్కించుకుంది. మ‌రి వివిధ కేటగిరీల‌లో నామినేష‌న్స్ ద‌క్కించుకున్న చిత్రాలు, న‌టుల వివ‌రాలు క్రింద చూడండి.

ఉత్తమ చిత్రం


- బాహుబలి: ది కన్‌క్లూజన్‌
- ఫిదా
- గౌతమీపుత్ర శాతకర్ణి
- ది ఘాజీ ఎటాక్‌
- శతమానం భవతి

ఉత్తమ దర్శకుడు


- క్రిష్‌(గౌతమీపుత్ర శాతకర్ణి)
- ఎస్‌ఎస్‌ రాజమౌళి(బాహుబలి2)
- సందీప్‌ వంగా(అర్జున్‌రెడ్డి)
- సంకల్ప్‌రెడ్డి(ది ఘాజీ ఎటాక్‌)
- సతీష్‌ వేగేశ్న(శతమానం భవతి)

ఉత్తమ నటుడు



- నందమూరి బాలకృష్ణ(గౌతమీపుత్ర శాతకర్ణి)
- ప్రభాస్‌(బాహుబలి2)
- విజయ్‌ దేవరకొండ(అర్జున్‌రెడ్డి)
- ఎన్టీఆర్‌(జై లవ కుశ)
- రానా దగ్గుబాటి(నేనే రాజు నేనే మంత్రి)

ఉత్తమ నటి



- అనుష్క(బాహుబలి2)
- రకుల్‌ప్రీత్‌సింగ్‌(జయ జానకీ నాయక)
- కాజల్‌(నేనే రాజు నేనే మంత్రి)
- రితికా సింగ్‌(గురు)
- సాయిపల్లవి(ఫిదా)

ఉత్తమ సహాయనటుడు


- ఆది పినిశెట్టి(నిన్నుకోరి)
- ప్రకాష్‌రాజ్‌(శతమానం భవతి)
- కేకే మేనన్‌(ది ఘాజీ అటాక్‌)
- సత్య రాజ్‌(బాహుబలి2)
- శ్రీవిష్ణు(ఉన్నది ఒకటే జిందగీ)

ఉత్తమ సహాయనటి



- భూమిక (ఎంసీఏ)
- జయసుధ(శతమానంభవతి)
- రమ్యకృష్ణ(బాహుబలి2)
- హేమమాలిని(గౌతమీ పుత్ర శాతకర్ణి)
- రాధిక(రాజా ది గ్రేట్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు



- ఎస్‌ఎస్ ‌తమన్‌(మహానుభావుడు)
- దేవి శ్రీ ప్రసాద్‌(ఖైదీ నంబర్‌ 150)
- ఎం.ఎం. కీరవాణి(బాహుబలి2)
- శక్తికాంత్‌(ఫిదా)
- గోపీ సుందర్‌(నిన్నుకోరి)

ఉత్తమ ప్రతినాయకుడు



- రానా దగ్గుబాటి( బాహుబలి2)
- తరుణ అరోరా( ఖైదీ నంబరు 150)
- రావు రమేష్‌(డీజే: దువ్వాడ జగన్నాథమ్‌)
- అర్జున్‌(లై)
- విజయ్‌ వర్మ(ఎంసీఏ)

ఉత్తమ హాస్యనటుడు



- రాహుల్‌ రామకృష్ణ(అర్జున్‌రెడ్డి)
- శ్రీనివాస్‌రెడ్డి(ఆనందో బ్రహ్మ)
- ప్రవీణ్‌ (శతమానం భవతి)
- బ్రహ్మానందం(ఖైదీ నంబర్‌ 150)
- షకలక శంకర్‌(ఆనందో బ్రహ్మ)

1666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles