ఫ్యాన్సీ రేటుకి సింగం-3 తెలుగు హక్కులు

Sun,August 7, 2016 03:48 PM
SIGHAM 3 gets fancy rate

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గినట్లుగానే ఈ చిత్రం తెలుగు హక్కులకు భారీ పోటీ నెలకొంది. అయితే ఈ చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ప్యాన్సీ రేటుతో దక్కించుకున్నాడు.

మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ తొలి నుంచి మా సంస్థలో వైవిధ్యమైన చిత్రాలను అందించాలనే భావనతోనే ఇటీవల సూర్య వర్సెస్ సూర్య, శౌర్య చిత్రాలను నిర్మించాను. ఇప్పుడు తాజాగా సూర్య ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3ను తెలుగు హక్కులను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు శివకుమార్. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి. వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం షూటింగ్‌లో అధికభాగం జరగడం విశేషంగా చెప్పుకోవాలి. తప్పకుండా ఈ చిత్రం తెలుగులోను అఖండ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

ప్రముఖ కథానాయికలు అనుష్క శెట్టి, శృతిహాసన్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాతక్మంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.

2182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles