ఏడాది తిర‌గ‌క ముందే విడాకులు ఇచ్చిన కొత్త బంగారు లోకం బ్యూటీ

Tue,December 10, 2019 12:43 PM

కొత్త బంగారు లోకం చిత్రంలో ఎ..క్క‌డా.. అంటూ యువ‌త మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ శ్వేతాబ‌సు ప్ర‌సాద్. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 13న రోహిత్ మిట్ట‌ల్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది శ్వేతా. పూణెలో బెంగాళీ, మరాఠీ సంప్రదాయాల్లో ఆమె పెళ్లి జరిగింది. నాలుగేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న ల‌వ్ బ‌ర్డ్స్ రెండేళ్ళ పాటు క‌లిసి జీవించారు. 11 ఏళ్ళ ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన శ్వేతా నేషనల్ అవార్డులను అందుకుంది.


ఏడాది తిర‌గ‌కుండానే శ్వేతా త‌న వివాహ బంధానికి బ్రేక‌ప్ చెప్పింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపింది. కొన్నినెల‌ల పాటు ఆలోచ‌న త‌ర్వాత రోహిత్‌, నేను విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడిపోతున్నాం. ఇక ఇప్ప‌టి నుండి ఎవ‌రి దారులు వారివి. ఇన్నాళ్లు మా ప్ర‌యాణంలో నాకు స‌పోర్ట్‌గా నిలిచిన రోహిత్‌కి ధ‌న్య‌వాదాలు. అత‌నికి ఎప్పటికి చీర్‌లీడర్‌గా ఉంటాను అని శ్వేతాబ‌సు పోస్ట్‌లో పేర్కొంది.

శ్వేతాబసుప్రసాద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2002లో మక్‌డీ అనే సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు వరించింది. తర్వాత టీవీషోల్లోనూ శ్వేత నటించింది. తెలుగులోనూ నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది. అనురాగ్ కశ్యప్ దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేసింది. ఈ క్రమంలో చిన్న చిత్రాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది శ్వేతా.

6577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles