బాలీవుడ్ పై మోజు తో శృతిహాసన్ కి చిక్కులు

Sun,June 18, 2017 11:46 AM
బాలీవుడ్ పై మోజు తో శృతిహాసన్ కి చిక్కులు

హీరోల మెంటాలిటీలోనూ, హీరోయిన్ల మెంటాలిటీలోనూ తేడా ఉంది. హీరోలు తమ భాషలో మాత్రమే మూవీస్ చేయడానికి ఇష్టపడతారు. ఇతర భాషలకు వెళ్లడం చాలా రేర్. కానీ హీరోయిన్స్ అలా కాదు.. వాళ్లకు భాషా భేదం లేదు. ఏ భాషలో సినిమా చేయడానికైనా రెడీనే. చాలామంది సౌత్ హీరోయిన్స్ కు బాలీవుడ్ అంటే యమ క్రేజ్. సౌత్ లో కాస్త సక్సెస్ లు రాగానే లగేజ్ సర్దుకొని బాలీవుడ్ కు చెక్కేస్తుంటారు. తర్వాత రెంటికీ చెడ్డ రేవడి అవుతుంటారు. ఇప్పుడు శృతి హాసన్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

శృతిహాసన్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళం భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ శ్రుతిహాసన్ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగిన ప్రాజెక్టులు లేవు. అందుకు కారణం ఆమె స్వయంకృతాపరాధం అని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏమిటా అపరాధం అంటే అందరిలాగే బాలీవుడ్ పై మోజు పడడమేనంటున్నారు. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి శృతి పెద్దగా ప్రయత్నించిన దాఖలాలు కనిపించవు. ఇక తెలుగులో గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు వంటి హిట్స్ ఉన్నా, ఆ క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి ఆమె కృషి చేయలేదు. ఇంట్రెస్ట్ చూపించలేదు. తన దృష్టి మొత్తం బాలీవుడ్ సినిమాలపైనే ఉంది. కొన్ని సినిమాలు చేసినా అక్కడ ఆమె పరిస్థితి హోప్ ఫుల్ గా లేదు. ఇక ఇక్కడా అవకాశాలు లేవు. అక్కడ విజయాలు లేవు. ఇకనైనా శ్రుతి మనసు మారుతుందేమో చూడాలి.

1453

More News

VIRAL NEWS