చాలా గ్యాప్ త‌ర్వాత కెమెరా ముందుకు..!

Sat,April 21, 2018 10:06 AM
Shruti Haasan & Vidyut Jammwal  shooting  had begin

క‌మ‌ల్ గారాల ప‌ట్టీ శృతి హాస‌న్ ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ఇటు తెలుగు అటు హిందీలో బిజీగా ఉండేది. తెలుగులో చివ‌రిగా కాట‌మ‌రాయుడు చిత్రం చేసిన శృతి హిందీలో బెహెన్ హోగీ తేరీ అనే చిత్రం చేసింది. ఇక త‌న తండ్రి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టించింది. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా, ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఇక సుంద‌ర్ క‌ల‌ల ప్రాజెక్ట్ సంఘ‌మిత్ర చిత్రంలో ముందుగా శృతిని క‌థానాయిక‌గా సెల‌క్ట్ చేయ‌గా, ఈ అమ్మ‌డు మిడిల్‌లోనే ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో దిశా ప‌ఠానీని తీసుకున్నారు. అయితే సినిమాల‌లో న‌టించేంద‌కు చాలా గ్యాప్ తీసుకున్న శృతి హాస‌న్ రీసెంట్‌గా ఓ బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది

శృతి హాస‌న్ తాజా చిత్రం మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. శుక్ర‌వారం సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం గ్యాంగ్‌స్ట‌ర్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని టాక్‌. శృతికి జోడిగా విద్యుత్ జ‌మ్వాల్ న‌టిస్తున్నారు. విజయ్‌ గలానీ, ప్రతీక్‌ గలానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏడాది చివ‌రిలో రిలీజ్ కానున్న‌ట్టు స‌మాచారం. అయితే కొన్నాళ్ళుగా సినిమాల‌కి దూరంగా ఉంటున్న శృతి త‌న ప్రియుడు మైఖేల్‌ కోర్సెల్‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలు వేసింది. ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్న వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్ళి పీటలెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. ఇరు కుటుంబాల పెద్ద‌లు వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో శృతి పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు ఉండ‌బోవ‌ని కోలీవుడ్ టాక్.


2972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles