ఇన్నాళ్ళ‌కి మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోబోతున్న‌ శృతి హాస‌న్

Mon,April 22, 2019 12:09 PM

సక‌ల క‌ళావ‌ల్ల‌భుడు క‌మ‌ల్ హాస‌న్ గారాల పట్టీ శృతి హాస‌న్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగ‌తి తెలిసిందే. న‌టిగా, సింగ‌ర్‌గా, ఆర్టిస్ట్‌గా ఇలా ఎన్నో విభాగాల‌లో త‌న ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తుంటుంది. తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్ర సీమ‌ల్లో ఓ వెలుగు వెలుగుతుంది శృతి. అయితే ఈ అమ్మ‌డు సినిమాలు విడుద‌ల కాక చాలా రోజులు అవుతుంది. దీంతో అభిమానులు ఆమె సినిమాల కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య శ‌భాష్ నాయుడు అనే చిత్రంలో క‌మల్‌తో క‌లిసి శృతి న‌టించింది. కాని ఈ సినిమా ఇప్ప‌ట్లో విడుద‌ల‌య్యేలా క‌నిపించ‌డం లేదు. అయితే తాజాగా సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్రంతో మంచి హిట్ కొట్టిన విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మైంది శృతి హాస‌న్. పురంపొక్కు ఎంగిర పొతువుద‌మై ఫేం ఎస్‌పీ జ‌న‌నథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. లాభం అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. దేశంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల గురించి ఈ చిత్రంలో వివ‌రించనున్న‌ట్టు స‌మాచారం.2473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles