బాయ్‌ఫ్రెండ్‌ని క్ష‌మించ‌మ‌ని కోరిన శృతి హాస‌న్‌..!

Sun,February 18, 2018 10:59 AM
Shruti Haasan send her birthday wishes to michael

క‌మ‌ల్ గారాల పట్టీ శృతి హాసన్ కొద్ది రోజులుగా మైఖేల్ కోర్సెల్‌తో చెట్టాప‌ట్టాలేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య మైఖేల్ కోర్సెల్ ని తల్లి సారికకి పరిచయం చేసింది శృతి . ఆ త‌ర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ పెళ్ళిలో మెరిసింది. వారితో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఉండడంతో శృతి పెళ్లికి సంబంధించి పుకార్లు గుప్పుమన్నాయి. త్వ‌ర‌లోనే శృతి ఇంట పెళ్లి బాజాలు మ్రోగ‌నున్నాయి అని బాలీవుడ్ మీడియా జోస్యాలు చెప్పింది. కట్ చేస్తే ఈ రోజు లండ‌న్‌కి చెందిన న‌టుడు, శృతి బాయ్ ప్రెండ్‌ మైఖేల్ కోర్సెల్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా త‌న ప్రియుడికి శృతి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది. ‘ మై బెస్ట్ ఫ్రెండ్, పార్ట్‌నర్ ఇన్ క్రైమ్, నాతో పాటు ప్రపంచాన్ని చుట్టొచ్చేందుకు ఇష్టపడే తోటి ప్రయాణికుడు. ప్రతి విషయంలోనూ నాతో పాటు నవ్వుతుండే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే’ అంటూ శ్రుతీహాసన్‌ ట్వీట్ చేశారు. ఈ శుభ స‌మ‌యంలో నీతో లేనందుకు క్ష‌మించు అని కోర్స‌ల్‌ని కోరింది శృతి. ఇక‌ ఫన్నియెస్ట్ మ్యాన్ ఐ నో, హార్ట్ ఆఫ్ గోల్డ్, బర్త్‌డే బాయ్, సారీ ఐయామ్ నాట్ దేర్, హ్యాపీమీ హ్యాపీస్ అనే హ్యాష్ ట్యాగ్స్‌తో మైఖెల్ కోర్సల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేసింది. శృతి పెళ్ళిపై ఎన్ని వదంతులు వ‌స్తున్న‌ప్ప‌టికి తాను మాత్రం మైఖేల్‌తో ఉన్న రిలేష‌న్ షిప్‌పై పూర్తి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. శ‌భాష్ నాయుడు చిత్రంతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది శృతి హాస‌న్.


2885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles