కేన్స్ లో శృతి హాస‌న్ సంద‌డి చూశారా..!

Sat,May 20, 2017 12:39 PM
SHRUTI HAASAN ROCKED AT THE CANNES?

క‌మ‌ల్ గారాల ప‌ట్టీ శృతి హాస‌న్ కేన్స్ 70వ అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్ లో సంద‌డి చేసింది. తొలి సారి ఈ అమ్మ‌డు కేన్స్ ఫెస్టివ‌ల్ కి హ‌జ‌రు కాగా, ఈమె ఆనందం అంతా ఇంతా కాదు. అబు జానీ సందీప్ కోస్లా శారీ ధ‌రించిన శృతి రెడ్ కార్పెట్ పై న‌డిచింది. ఈ అమ్మ‌డి లుక్ ని చూసి కేన్స్ ప్రేక్ష‌కులు థ్రిల్ అయ్యారు. సంఘ‌మిత్ర టీం కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో పాల్గోన్నారు. ద‌ర్శ‌కుడు సుంద‌ర్ . సి, థెండాళ్ సంస్ధ నుండి ముర‌ళీ రామ‌సామి , హెమ రుక్మిణి నిర్మాత‌లుగా హాజ‌ర‌య్యారు. ఎఆర్ రెహ‌మాన్ , సాబు సిరిల్, జ‌యం ర‌వి, ఆర్య‌లు కూడా రెడ్ కార్పెట్ ద‌గ్గ‌ర సంద‌డి చేశారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి శృతి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా ఇందులో క‌త్తి ప‌ట్టి వీర‌నారిగా క‌నిపిస్తున్న శృతి లుక్ ఫ్యాన్స్ లో అంచ‌నాలు పెంచింది. తెలుగు, త‌మిళం, హిందీ , కన్నడ భాష‌ల‌లో సంఘ‌మిత్ర చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.2014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles