శృతి ఇంట మోగ‌నున్న పెళ్లి బాజా..!

Fri,December 1, 2017 09:33 AM
Shruti Haasan, Michael Corsale and Sarika in one frame

క‌మ‌ల్ గారాల ప‌ట్టీ శృతి హాస‌న్ త‌న పెళ్లి టాపిక్‌తో మ‌రోసారి వార్త‌ల‌లోకి ఎక్కింది. కొంత కాలంగా లండ‌న్ న‌టుడు మైఖేల్ కోర్సెల్‌తో స‌న్నిహితంగా ఉంటున్న శృతి రీసెంట్‌గా ఆయ‌న‌ని ముంబైకి తీసుకు వ‌చ్చి త‌న త‌ల్లి సారికకి ప‌రిచ‌యం చేసింద‌ట‌. అంతేకాదు వీరంద‌రు క‌లిసి రెస్టారెంట్‌కి వెళ్లి స‌ర‌దాగా గ‌డిపార‌ని తెలుస్తుంది. మైఖేల్‌, శ్రుతి, సారిక కలిసిన ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో త్వ‌ర‌లోనే శృతి పెళ్ళి జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని బాలీవుడ్ మీడియా జోస్యాలు చెబుతుంది. గ‌తంలోను శృతికి, మైఖేల్‌కి సంబంధించి ప‌లు రూమ‌ర్స్ రావ‌డంతో దీనిపై స్పందించిన శృతి ద‌య‌చేసి త‌నపై పుకార్లు పుట్టించ‌వ‌ద్ద‌ని కోరింది. మ‌రి ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్ర‌స్తుతం త‌న తండ్రి తెర‌కెక్కిస్తున్న శ‌భాష్ నాయుడు చిత్రం త‌ప్ప శృతి మ‌రే ప్రాజెక్ట్ చేయ‌డం లేదు.

7875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles