HomeLATEST NEWSShruti Haasan increase the speed on industry

తెలుగులో మ‌ళ్ళీ స్పీడ్ పెంచిన శృతి హాస‌న్

Published: Mon,June 3, 2019 09:50 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ కొన్నాళ్ళ‌పాటు మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు అతి త్వ‌ర‌లో పెళ్ళి చేసుకోనున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే అనుకోకుండా వీరి ప్రేమ‌కి బ్రేక్ ప‌డింది. ఇటీవ‌ల మైకేల్ దుర‌దృష్ట‌వ‌శాత్తు మేమిద్ద‌రం ఒంటరి మార్గాల‌లో న‌డ‌వాల్సి వ‌స్తుంది. కాని ఈ యంగ్ లేడీ ఎప్ప‌టికి నా బెస్ట్ ఫ్రెండే. నువ్వు నాకు ఫ్రెండ్‌గా దొర‌కడం నా అదృష్టం. ఆమెకి జీవితాంతం స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్ప‌గా ఫీల‌వుతున్నాను . ల‌వ్ యూ గాల్ అని ట్వీట్‌లో పోస్ట్ చేశాడు. అయితే రెండేళ్ళ‌పాటు సినిమాల‌కి దూరంగా ఉన్న శృతి హాస‌న్ సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్రంతో మంచి హిట్ కొట్టిన విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పురంపొక్కు ఎంగిర పొతువుద‌మై ఫేం ఎస్‌పీ జ‌న‌నథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. లాభం అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం దేశంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల గురించి ఈ చిత్రంలో వివ‌రించనున్న‌ట్టు స‌మాచారం.

తెలుగులోను శృతి హాస‌న్ స్పీడ్ పెంచింది. కొర‌టాల శివ‌- చిరంజీవి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని అంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి న‌టించిన శృతి హాస‌న్ ఇప్పుడు చిరంజీవి తోను క‌లిసి ప‌ని చేయ‌నుండ‌డం విశేషం. మ‌రోవైపు గోపిచంద్ మలినేని,రవి తేజ కాంబినేషన్ లో రానున్న ఓ మూవీ లో కూడా శృతి నటించే అవకాశాలున్నాయి అంటున్నారు. మొత్తానికి ప్రియుడి నుండి విడిపోయిన త‌ర్వాత శృతి హాస‌న్ ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల‌తో బిజీ అయింది.
2416
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology