త‌ల్లి ఎంట్రీతో ఫుల్ ఖుష్ అయిన శృతి హాస‌న్‌

Sun,May 6, 2018 11:52 AM
Shruti Haasan feels happy with her mother entry

క‌మ‌ల్ గారాల ప‌ట్టీ శృతి హాస‌న్ ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ఇటు తెలుగు అటు హిందీలో బిజీగా ఉండేది. తెలుగులో చివ‌రిగా కాట‌మ‌రాయుడు చిత్రం చేసిన శృతి హిందీలో బెహెన్ హోగీ తేరీ అనే చిత్రం చేసింది. త‌న తండ్రి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టించింది. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఆ మ‌ధ్య త‌న ప్రియుడు మైఖేల్ కోర్సెల్‌తో క‌లిసి చెట్టాపట్టాలు వేస్తూ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచింది శృతి హాస‌న్. సినిమాల‌లో న‌టించేంద‌కు చాలా గ్యాప్ తీసుకున్న శృతి హాస‌న్ రీసెంట్‌గా ఓ బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది. మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్ట‌ర్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని టాక్‌. శృతికి జోడిగా విద్యుత్ జ‌మ్వాల్ న‌టిస్తున్నారు. విజయ్‌ గలానీ, ప్రతీక్‌ గలానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏడాది చివ‌రిలో రిలీజ్ కానున్న‌ట్టు స‌మాచారం. అయితే సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో శృతి తల్లి సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి అంద‌రిని ఆశ్చర్య‌ప‌ర‌చింది. త‌ల్లి రావ‌డంతో శృతి హాస‌న్ చాలా ఆనందంగా ఫీలైంది. ఇక త‌న న‌ట‌నని సారిక అప్రిషియేట్ చేయ‌డంతో ఇలాంటి అనుభవం జీవితంలో మ‌రిచిపోలేనిద‌ని శృతి పేర్కొంది. న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌హేష్ మంజ్రేక‌ర్‌కి సారికతో ప‌రిచ‌యం ఉంద‌ని, మ‌హేష్ సూచ‌న‌ల‌తో తాను న‌టించ‌డం చూసి త‌ల్లి అభినందించి ప్రోత్సహించింద‌ని శృతి హాస‌న్ వెల్ల‌డించారు.

3872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles