త‌న పెళ్లి వార్త‌పై వ్యంగంగా స్పందించిన శృతి

Sat,January 5, 2019 10:17 AM
Shruti Haasan comments on fake news

క‌మ‌ల్ గారాల పట్టీ శృతి హాసన్‌కి సంబంధించి ఈ మ‌ధ్య పెద్ద‌గా వార్త‌లు రావ‌డం లేదు. ఆ మ‌ధ్య యూర‌ప్‌కి చెందిన మైఖేల్ కోర్సెల్‌తో చెట్టాప‌ట్టాలేసిన ఈ అమ్మ‌డు అత‌డిని త‌నత‌ల్లి సారికకి పరిచయం చేసింది శృతి . ఆ త‌ర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ పెళ్ళిలో మెరిసింది. వారితో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఉండడంతో శృతి పెళ్లికి సంబంధించి పుకార్లు గుప్పుమన్నాయి. త్వ‌ర‌లోనే శృతి ఇంట పెళ్లి బాజాలు మ్రోగ‌నున్నాయి అని బాలీవుడ్ మీడియా జోస్యాలు చెప్పింది. అయితే వీరిద్ద‌రికి సంబంధించి కొన్నాళ్ళుగా ఎలాంటి వార్త‌లు రాక‌పోవ‌డం విశేషం.

ఈ మ‌ధ్య శృతి లండ‌న్‌కి వెళ్లి త‌న బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుకలు జ‌రుపుకున్నారు. స్నేహితులు, మైఖేల్‌తో క‌లిసి కొన్ని ఫోటోలు దిగ‌గా వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మ‌ళ్లీ శృతి పెళ్ళిపై ప్ర‌చారం మొద‌లైంది. ఓ పత్రిక 2019లో శృతి త‌న బాయ్ ఫ్రెండ్‌ని చేసుకోబోతున్నార‌ని క‌థ‌నం రాసింది. దీనిని రీ ట్వీట్ చేస్తూ .. నిజంగా ?.. ఇది నాకు వార్తే’ అంటూ కాస్త వ్యంగ్యంగా స్పందించారు. హిందీలో ‘బెహెన్‌ హోగీ తెరి’ త‌ర్వాత శృతి మ‌ళ్ళీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం శ‌భాష్ నాయుడులో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

View this post on Instagram

Happy new year !!!!! ❤️💕

A post shared by @ shrutzhaasan on

2645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles