గోల్డెన్ లెగ్ బ్యూటీ శృతికి బర్త్ డే విషెస్

Sat,January 28, 2017 07:18 AM
Shruti Haasan birthday

స్టార్ హీరోల తనయులు హీరోలవుతారు. ఆ హీరోల డాటర్స్ సినిమా రంగంలో ఎంటర్ కావడం చాలా అరుదు. అలాంటి అరుదైన హీరోయిన్ శృతిహాసన్. ఆమె తండ్రి కమల్ హాసన్ విశిష్ట నటుడు. అయితే శృతిహాసన్ కు చాలా కాలం వరకు కాలం కలిసిరాలేదు. ఫ్లాప్స్ దెబ్బతీశాయి. కానీ వాటిలోంచి బయటపడి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శృతిహాసన్.

తండ్రి కమల్ హాసన్ మంచి నటుడు కాబట్టి ఆ నట లక్షణాలు శృతి హాసన్ కు కూడా వచ్చాయి. శృతి మొదట డాడీ సొంత సినిమాలోనే నటించింది. హే రామ్ లో బాలనటిగా కనిపించిన శ్రుతిహాసన్ ఆ తర్వాత 2009లో బాలీవుడ్ మూవీ లక్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ పిక్చర్ ఆమెకు లక్ తీసుకు రాలేదు. అదే ఇయర్ తెలుగులో అనగనగా ఒక ధీరుడు లో యాక్ట్ చేసింది. అయితే ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది.

తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో చేసినా మొదట్లో శృతిహాసన్ కు అన్నీ ఫ్లాప్ లే ఎదురయ్యాయి. ఆమె మీద ఐరన్ లెగ్ అని పేరు పడింది. కమల్ హాసన్ కూతురే అయినా శృతిహాసన్ కు టైం కలిసి రాలేదు. 2012లో పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా శృతికి స్టార్ తిరిగి స్టార్ హీరోయిన్ రూట్ లోకి వచ్చింది.

ఆ తర్వాత రేసుగుర్రంలా దూసుకుపోయింది శ్రుతి. ఆగడు లో కామియో రోల్ వేసినా మంచి పేరొచ్చింది. 2015లో శ్రుతికి బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు మరో టర్నింగ్ పాయింట్ అయింది. స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. అదే ఏడు రిలీజైన వేదాళం అనే తమిళ మూవీ కూడా శ్రుతిహాసన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. గత ఏడాది రిలీజైన ప్రేమమ్ కూడా హిట్ కావడంతో ఐరన్ లెగ్ .. గోల్డెన్ లెగ్ గా మారింది. ఇక సూర్యతో యాక్ట్ చేసిన సింగం 3 మూవీ ఈ ఫిబ్రవరిలో రిలీజవుతుంది.

స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శృతిహాసన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడు లోనూ, ఆమె తండ్రి తెరకెక్కిస్తోన్న శభాష్ నాయుడు మూవీలోనూ నటిస్తోంది. ఈ సినిమాలే కాక .. హిందీ మూవీ .. బెహన్ హోగీ తేరీ లోనూ యాక్ట్ చేస్తోంది. మరి రానున్న రోజులలో ఈ అమ్మడు మరిన్ని సినిమాలలో నటిస్తూ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని మనమంతా కోరుకుందాం.

1640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles