పాఠాలు చెప్పనున్న శృతిహాసన్

Tue,December 1, 2015 12:01 AM
Shruti Haasan as professor


హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ గబ్బర్‌సింగ్ బ్యూటీ శృతిహాసన్ శ్రీమంతుడు సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయంతో మంచి జోష్‌మీదున్న ఈ బ్యూటీ త్వరలో కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నాజూకు సుందరి నెక్ట్స్ ప్రాజెక్టులో ప్రొఫెసర్‌గా కనిపించబోతుంది. మలయాళంలో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన ప్రేమమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ చందుమొండేటి.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ప్రొఫెసర్‌గా దర్శనమివ్వనుంది. నాగచైతన్య ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా నటిస్తున్నాడు. శృతిహాసన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా నటిస్తుంది. ప్రొఫెసర్ పాత్ర కోసం సినిమా వరిజినల్ వెర్షన్‌ను చూసిన శృతి అందుకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మలుచుకునే పనిలో నిమగ్నమైందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కథాపరంగా ఇంజినీరింగ్ స్టూడెంట్ ప్రొఫెసర్ తో ప్రేమలో పడతాడు. మొదటి సారిగా వస్తున్న ఈ కాంబినేషన్ తెరమీద ఎలాంటి ఫర్‌ఫార్మెన్స్ చేస్తారో చూడాలి మరీ!

2422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles