త‌న ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పిన శృతి హాస‌న్

Fri,April 26, 2019 11:52 AM

సెల‌బ్రిటీల‌లో ప్రేమ.. ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు బ్రేక‌ప్ అవుతుందో ఎవ‌రికి అర్ధం కాదు. అప్ప‌టి వ‌ర‌కు చెట్టాప‌ట్టాలు వేసుకుంటూ స‌ర‌దాగా స‌మ‌యం గ‌డిపిన వారు ఒకేసారి బ్రేక‌ప్ అన‌డం కామ‌న్‌గా మారింది. క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతిహాస‌న్ కొన్నాళ్ళుగా మైఖేల్ కోర్సెల్‌తో చెట్టాప‌ట్టాలేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య మైఖేల్ కోర్సెల్ ని తల్లి సారికకి పరిచయం చేసింది శృతి . ఆ త‌ర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ పెళ్ళిలో మెరిసింది. వారితో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఉండడంతో శృతి పెళ్లికి సంబంధించి పుకార్లు గుప్పుమన్నాయి. త్వ‌ర‌లోనే శృతి ఇంట పెళ్లి బాజాలు మ్రోగ‌నున్నాయి అని బాలీవుడ్ మీడియా జోస్యాలు చెప్పింది. కాని త‌మ ప్రేమ‌కి బ్రేక‌ప్ ప‌డిందని శృతి ప్రియుడు మైకేల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.


జీవితం మా ఇద్ద‌రిని భూగోళానికి వ్యతిరేక వైపులా ఉంచింది . దుర‌దృష్ట‌వ‌శాత్తు మేమిద్ద‌రం ఒంటరి మార్గాల‌లో న‌డ‌వాల్సి వ‌స్తుంది. కాని ఈ యంగ్ లేడీ ఎప్ప‌టికి నా బెస్ట్ ఫ్రెండే. నువ్వు నాకు ఫ్రెండ్‌గా దొర‌కడం నా అదృష్టం. ఆమెకి జీవితాంతం స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్ప‌గా ఫీల‌వుతున్నాను . ల‌వ్ యూ గాల్ అని ట్వీట్‌లో పోస్ట్ చేశాడు మేకేల్‌. లండ‌న్ కుర్రాడు ఇచ్చిన సందేశంతో శృతి హాస‌న్‌.. మైకేల్ ప్రేమ‌కి పులిస్టాప్ ప‌డింద‌ని, వీరిరివురు ఎప్ప‌టికి స్నేహితులుగానే ఉంటార‌నే అర్ధ‌మవుతుంది. రెండేళ్ళ‌పాటు సినిమాల‌కి దూరంగా ఉన్న శృతి హాస‌న్ సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్రంతో మంచి హిట్ కొట్టిన విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పురంపొక్కు ఎంగిర పొతువుద‌మై ఫేం ఎస్‌పీ జ‌న‌నథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. లాభం అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. దేశంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల గురించి ఈ చిత్రంలో వివ‌రించనున్న‌ట్టు స‌మాచారం.

2434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles