బాయ్ ఫ్రెండ్ తో స్పెష‌ల్ స్క్రీనింగ్ కి హాజ‌రైన శృతి

Fri,July 28, 2017 06:21 PM
Shruti Haasan And Her Boyfriend Spotted At The Screening

తిగ్ మన్షు దులియా ద‌ర్శ‌క‌త్వంలో కునాల్ క‌పూర్, మోహిత్ మ‌ర్వా, మృదుల, అమిత్ స‌ద్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం రాగ్ దేష్ . ఈ రోజు గ్రాండ్ గా విడుద‌లైన ఈ చిత్రం సెల‌బ్రిటీల కోసం ప్ర‌త్యేకంగా స్పెష‌ల్ స్క్రీనింగ్ జ‌రుపుకుంది. డిఫ‌రెంట్ ఫీల్డ్స్ కి సంబంధించిన సెల‌బ్రిటీలు ఈ షోకి హాజ‌ర‌య్యారు. ర‌ణదీప్ హుడా, హృతిక్ రోష‌న్, కిర‌ణ్ రాం , సౌర‌భ్ మిశ్రా తో పాటు దిగ్విజ‌య్ సింగ్ ఆయ‌న భార్య‌తో క‌లిసి ఈ షోకి వ‌చ్చారు. అయితే ఇంత మంది సెల‌బ్రిటీలు వ‌చ్చిన మీడియా అటెన్ష‌న్ మాత్రం శృతిపై మాత్ర‌మే ఉంది. అందుకు కార‌ణం ఈ అమ్మ‌డు త‌న బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కొర్సలే తో క‌లిసి షోకి హాజ‌రు కావ‌డ‌మే. ఈ ఇద్ద‌రు క‌లిసి కొద్ది సేపు అక్క‌డ తెగ హ‌డావిడి చేయ‌గా, ఫోటోగ్రాఫ‌ర్స్ ఈ జంట‌ని త‌మ కెమెరాల‌లో బంధించారు. లండన్ లో ఉంటున్న‌ ఇటాలియ‌న్ బాయ్ మైఖేల్ కొర్సలే బుధవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగగా , అత‌డిని రిసీవ్ చేసుకోవడానికి శృతి ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. మేఖేల్ కారులోకి ఎక్క‌గానే ఎగ్జైట్ మెంట్ తో అత‌డిని గట్టిగా హగ్ చేసుకుంది .ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ గా మారాయి.
7520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles