తండ్రికి సాయం చేస్తానంటున్న శృతిహాసన్

Mon,April 1, 2019 04:51 PM
Shruthi Haasan wants to help kamal in politics


మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ పెట్టిన తర్వాత తన ప్రణాళికలతో బిజీగా మారారు ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ప్రస్తుతం తమిళనాడు అంతటా చుట్టి వస్తున్నారు కమల్‌హాసన్. తమిళనాడులో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తన యాత్ర కొనసాగిస్తున్నారు కమల్‌హాసన్. అయితే తన తండ్రి కమల్‌హాసన్ రాజకీయ అరంగేట్రంపై శృతిహాసన్ స్పందించింది.

ఇటీవలే మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో శృతిహాసన్ మాట్లాడుతూ..తన తండ్రి లాంటి నిజాయితీ గల మనుషులు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని అభిప్రాయపడింది. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రానని, అయితే తెరవెనుక తన తండ్రికి తనవంతు సాయం చేస్తానని చెప్పింది శృతిహాసన్. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు తాను ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని పేర్కొంది.

2290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles