త‌మిళ అర్జున్ రెడ్డిలో క‌థానాయిక ఎవ‌రంటే..!

Tue,July 3, 2018 10:38 AM
Shriya Sharma to be pair with dhruv in varma movie

చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ .. వ‌ర్మ టైటిల్‌తో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా త‌మిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెర‌కెక్కిస్తున్నాడు. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజ‌యం సాధించ‌డంతో త‌మిళంలోను ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. రీసెంట్‌గా అర్జున్ రెడ్డి గెట‌ప్‌లో ధృవ్ లుక్ ఒక‌టి బ‌య‌ట‌కి రాగా, ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఈశ్వ‌రీరావుని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేక‌పోవ‌డంతో అభిమానులు ప‌లు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం వ‌ర్మ చిత్రంలో ధృవ్ స‌ర‌స‌న శ్రీయా శ‌ర్మ‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేయ‌నున్నార‌ట.

3074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles