బాహుబ‌లి ప్రీక్వెల్‌లో శ్రియ‌

Thu,November 15, 2018 08:35 AM
shriya plays key role in baahubalu prequel

రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సిరీస్‌లో వ‌చ్చిన రెండు పార్టుల‌కి ద‌క్కని గౌర‌వం లేదు, అందుకోని అవార్డులు లేవు . బాహుబ‌లి చిత్రానికి అన్ని కుదిరడంతో ఇండియాలోనే కాక ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా అశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. చైనాలోను ఈ చిత్రం విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కనుంది . ఈ ప్రీక్వెల్ వెండితెర‌పై కాకుండా ఆన్‌లైన్ సిరీస్‌గా ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల‌లో రూపొంద‌నుంద‌ని స‌మాచారం. శివ‌గామి చిన్న‌త‌నం నుండి జరిగే క‌థ‌ని ప్రీక్వెల్‌లో చూపించ‌నుండగా, దీని కోసం మాహిష్మ‌తి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్ రూపొందించి ప్రీక్వెల్ తెర‌కెక్కించ‌నున్నారు.

ప్రీక్వెల్ సుమారు రూ.350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొంద‌నుంద‌ని తెలుస్తుండ‌గా, మొత్తం మూడు సీజన్లుగా ఈ సిరీస్ ఉండ‌నుంద‌ట‌. రాజమౌళి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దేవా కట్టా, ప్రవీణ్‌ సత్తారులతో పాటు మరో బాలీవుడ్‌ దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌కి ప‌ని చేయ‌నున్నారట‌. ఓ శివ‌గామి అనే టైటిల్‌ని ఆన్‌లైన్ సిరీస్‌కి ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.7 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారట. అయితే ఇందులో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్‌ థాకూర్‌ నటించ‌నుండ‌గా , సీనియర్‌ నటి శ్రియ మరో కీలక పాత్రలో నటించనున్నారు. అతి త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్లడించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

2699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles