ర‌ష్య‌న్ క్రీడాకారుడిని వివాహ‌మాడిన శ్రియ‌..!

Sat,March 17, 2018 11:51 AM
Shriya married russian person on march 12

ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో సీక్రెట్ పెళ్లిళ్ళ సంఖ్య క్ర‌మ క్ర‌మంగా పెరుగుతూ పోతుంది. గ‌త‌ ఏడాది విరుష్క దంప‌తులు ఇట‌లీలో రహ‌స్య వివాహం చేసుకోగా, ఆ త‌ర్వాత‌ టైగ‌ర్ ష్రాఫ్‌, దిశా ప‌ఠానీలు శ్రీలంక‌లో పెళ్లి చేసుకున్న‌ట్టు ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక దీపికా ప‌దుకొణే, ర‌ణ్‌వీర్ సింగ్‌ల వివాహం కూడా త్వ‌ర‌లోనే సీక్రెట్‌గా జ‌రగనుంద‌ని కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థ‌లు చెబుతున్నాయి. క‌ట్ చేస్తే 37 ఏళ్ళ‌ వ‌య‌స్సులోను త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తున్న శ్రియ త‌న బాయ్ ఫ్రెండ్‌, రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కోస్‌చీవ్‌ని వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మార్చి 12న ముంబైలోని త‌న ఇంట్లో ప్రైవేట్ స‌ర్మ‌నీగా శ్రియ త‌న బాయ్ ఫ్రెండ్‌ని వివాహం చేసుకుంద‌ట‌. ఇండ‌స్ట్రీకి సంబంధించి మ‌నోజ్ బాజ్‌పేయ్‌, ష‌బానా అజ్మీ మాత్ర‌మే పెళ్ళికి హాజ‌ర‌య్యార‌ని స‌మాచారం. ప్రీ వెడ్డింగ్ వేడుక‌ని మార్చి 11న జ‌రుపుకున్న శ్రియ‌, ఆండ్రీలు ఈ కార్య‌క్ర‌మానికి క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని మాత్ర‌మే ఆహ్వానించిన‌ట్టు తెలుస్తుంది. శ్రియ వివాహం హిందూ ఆచారం ప్ర‌కారం జ‌రిగిన‌ట్టు తెలుస్తుండ‌గా, పెళ్ళిలో పింక్ ఔట్‌ఫిట్‌లో ఈ అమ్మ‌డు మెరిసిన‌ట్టు చెబుతున్నారు. గ‌తంలోనే ఈ ప్రేమ జంట‌కి సంబంధించి ఎన్నో పుకార్లు బ‌య‌ట‌కి వ‌చ్చిన దీనిపై వీరిద్ద‌రు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. శ్రియ 2001లో ఇష్టం సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది. తుజే మేరీ క‌స‌మ్‌తో బాలీవుడ్‌కి ఎంట‌ర్ కాగా, త‌మిళంలో శివాజీ సినిమాతో కోలీవుడ్ త‌లుపు త‌ట్టింది. హిందీ, ఇంగ్లీష్ భాష‌కి సంబంధించిన ప‌లు సినిమాల‌లో నటించిన శ్రియ రీసెంట్‌గా గాయ‌త్రి అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చిరంజీవి, బాలకృష్ణ‌, నాగార్జున, వెంక‌టేష్ వంటి టాప్ స్టార్స్ స‌ర‌స‌న న‌టించిన శ్రియ ప్రస్తుతం ‘వీర భోగ వసంత రాయలు’, తమిళ్‌లో నరగసూరన్‌, హిందీలో తడ్కా చిత్రాల్లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

6289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles