నాగ్‌, నాని మ‌ల్టీ స్టార‌ర్ మూవీలో మ‌ణిర‌త్నం బ్యూటీ!

Thu,February 15, 2018 11:43 AM
shraddha srinath heroine for multi starrer

టాలీవుడ్ న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 24 న ఈ ప్రాజెక్ట్ అఫీషియ‌ల్‌గా లాంచ్ కానుంది. శ‌మంత‌క‌మ‌ణి, భ‌లే మంచి రోజు చిత్రాల‌ని తెర‌కెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌ని తెర‌కెక‌కించ‌నుండ‌గా, ఇందులో క‌న్న‌డ బ్యూటీ శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చెలియా( త‌మిళంలో కాట్రు వేల‌యిదై) చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన‌ శ్ర‌ద్ధా త‌న గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌తోను ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో మ‌ల్టీ స్టార‌ర్ మూవీ కోసం ఈ అమ్మడిని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. దీనిపై అఫియ‌ల్ ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. సి. అశ్వినీద‌త్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తాడ‌ని, నాని డాక్ట‌ర్ పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా కోసం మ‌రో క‌థానాయిక‌ అన్వేషణ జరుగుతోంది. నాని ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధం చిత్రం చేస్తుండడంతో పాటు త‌న నిర్మాణంలో రూపొందిన అ సినిమాకి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు. ఇక నాగ్ ప్ర‌స్తుతం వ‌ర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త‌ర్వాత నాగ్ సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్ చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్టుల త‌ర్వాత మ‌ల్టీ స్టార‌ర్ ప‌ట్టాలెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles