బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకి చిక్క‌న సాహో భామ‌!

Sat,December 8, 2018 01:30 PM
Shraddha Kapoor Was Spotted With Rumored Boyfriend

టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో సాహో ఒక‌టి. ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సుజీత్ తెర‌కెక్కిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తుంది. ఈ అమ్మ‌డు కొద్ది రోజులుగా ఫోటో గ్రాఫ‌ర్ రోహ‌న్ శ్రేష్ట‌తో డేటింగ్‌లో ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో గ‌త రాత్రి శ్ర‌ద్ధా, రోహాన్ క‌లిసి బ‌య‌ట చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, వీరిద్ద‌రు కెమెరా కంటికి చిక్కారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 9 ఏళ్ళ నుండి శ్ర‌ద్ధాకి రోహిత్‌తో ప‌రిచ‌యం ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, కొన్ని నెల‌ల క్రితం నుండే వారిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నార‌ట‌. ఈ ఏడాది క‌ర‌ణ్ జోహ‌ర్ ఏర్పాటు చేసిన దీవాళి బాష్‌లో కూడా శ్ర‌ద్ధా క‌పూర్‌, రోహాన్‌లు జంట‌గా క‌నిపించారు. శ్ర‌ద్ధా ప్ర‌స్తుతం సాహోతో పాటు సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లోను న‌టిస్తుంది.


6443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles