థియేట‌ర్‌లో ప్ర‌భాస్ ఫ్యాన్స్ హంగామా.. వీడియో షేర్ చేసిన శ్ర‌ద్ధా

Sat,June 15, 2019 08:58 AM
Shraddha Kapoor shares prabhas fans hungama video

భారీ అంచ‌నాల‌తో ఆగ‌స్ట్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సాహో చిత్ర టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లైన సంగతి తెలిసిందే. 24 గంట‌ల‌లో అనేక రికార్డులు తిర‌గరాసింది. సోష‌ల్ మీడియాలోను ట్రెండింగ్‌లో ఉన్న సాహో టీజ‌ర్‌కి ప్రేక్ష‌కుల నుండే కాక సెల‌బ్రిటీల నుండి కూడా భారీ స్పంద‌న రావ‌డం విశేషం. అయితే సాహో టీజ‌ర్ ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లోను ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్ సాహో టీజ‌ర్ మొద‌లైన వెంట‌నే వెండితెర ముందుకి వెళ్ళి హుషారుగా డ్యాన్స్‌లు చేశారు. వారి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోను బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తుంటే సాహో చిత్రం భారీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌నిపిస్తుంది. ప్ర‌భాస్‌తో ప‌ని చేయ‌డం క‌ల‌గా ఉంది. సాహో చిత్ర యూనిట్ రెండే ళ్ళ పాటు ప‌డ్డ క‌ష్టానికి త‌ప్ప‌క ప్ర‌తిఫ‌లం ద‌క్కుతుంది. టీజ‌ర్‌కి వ‌చ్చిన స్పంద‌న‌ని చూస్తుంటే సాహో ప‌లు రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌నిపిస్తుంది అని శ్ర‌ద్ధా క‌పూర్ పేర్కొన్నారు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సాహో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప‌లు భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

2743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles