త్వ‌ర‌లో బాలీవుడ్‌లో మ‌రో పెళ్లి..!

Wed,March 20, 2019 10:32 AM
Shraddha Kapoor marries his boy friend very soon

బాలీవుడ్‌లో గ‌త ఏడాది వ‌రుస పెళ్ళిళ్ళు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ముందుగా సోన‌మ్ క‌పూర్ త‌న ప్రియుడిని వివాహం చేసుకోగా, ఆ త‌ర్వాత దీపికా ప‌దుకొణే , ప్రియాంక చోప్రా ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త‌మ‌కి న‌చ్చిన వారితో ఏడ‌డుగులు వేసారు. ఈ ఏడాది కూడా కొంద‌రు భామ‌లు మూడు ముళ్ళు వేయించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా సాహో భామ శ్ర‌ద్ధా క‌పూర్ కూడా పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్ది రోజులుగా రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రాఫర్‌తో శ్ర‌ద్ధా డేటింగ్‌లో ఉంది. ఇద్దరు క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టారు. అయితే ఇంట్లో పెద్ద‌లు పెళ్ళి చేసుకోవాల‌ని బ‌ల‌వంతం పెడుతుండ‌డంతో త‌న బాయ్ ఫ్రెండ్‌ని వ‌చ్చే ఏడాది వివాహం చేసుకోవాల‌ని శ్ర‌ద్ధ అనుకుంటుంద‌ట‌. మ‌రి దీనిపై శ్ర‌ద్ధ క‌పూర్ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ప్ర‌స్తుతం సాహో చిత్రంతో పాటు చిచ్చోరే, ఏబీసీడీ 3, బాఘీ 3 చిత్రాల‌లో నటిస్తుంది బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. డెంగ్యూ వ‌ల‌న తాను సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న విష‌యం విదిత‌మే.

3204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles