బాఘీ 3లో సాహో బ్యూటీ

Tue,February 12, 2019 12:05 PM

తెలుగులో సూపర్ హిట్ అయిన వర్షం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన బాఘి చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ మూవీకి సీక్వెల్‌గా బాఘీ2 చిత్రాన్ని తీసారు. అహ్మద్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం గ‌త ఏడాది మార్చి 30న విడుద‌లై మిక్స్‌డ్‌ టాక్ ద‌క్కించుకుంది . చిత్రంలో టైగర్ ష్రాఫ్, దిశాపటానీ ప్రధాన పాత్రలలో పోషించ‌గా నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ బాఘీ2 రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండానే బాఘీ 3 కూడా ప్లాన్ చేశారు .ఇందులోను టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటించనుండగా, క‌థానాయిక‌గా ఎవ‌రిని తీసుకుంటార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. బాఘీ మొద‌టి పార్ట్‌లో టైగ‌ర్ స‌ర‌స‌న న‌టించిన శ్ర‌ద్ధా క‌పూర్‌నే మూడో పార్ట్‌లో కొన‌సాగిస్తున్న‌ట్టు చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.


అహ్మ‌ద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో మూడో పార్ట్ తెర‌కెక్క‌నుండ‌గా, సాజిద్ న‌డియావాలా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మూడో పార్ట్‌ని 2020 మార్చి 6న విడుదల కానుంది. అయితే బాఘీ సిరీస్‌లో వ‌చ్చిన రెండో పార్ట్ తెలుగు సినిమా క్ష‌ణంకి రీమేక్‌గా తెరకెక్క‌గా, మూడో పార్ట్ ఏ చిత్రాన్ని రీమేక్‌గా తీస్తారో చూడాలి. బాఘీ 3లో క‌థానాయిక‌గా ఎంపికైన శ్ర‌ద్ధా ఇప్ప‌టికే ప‌లు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంది. తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న సాహో చిత్రం చేస్తుంది. ఏబీసీడీ సిరీస్‌లో వ‌స్తున్న మూడో పార్ట్ స్ట్రీట్ డ్యాన్స‌ర్‌, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కామెడీ డ్రామా చిచోరే, సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌ల‌లోను న‌టిస్తుంది ఈ అమ్మ‌డు.1751
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles