సాహో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న‌ హీరోయిన్స్

Fri,May 19, 2017 05:37 PM
Shraddha Kapoor and Disha Patani shocks to sahoo producers

కొంతకాలం నుంచీ హీరోయిన్స్ కూడా కోట్లలోనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. వారిలో సీనియర్ హీరోయిన్స్ తో పాటు తక్కువ సినిమాలు చేసిన వారూ ఉన్నారు. ఒక సినిమా హిట్ అయితే అమాంతం తమ పారితోషికాన్ని పెంచేస్తున్నారు. తాము ఎంత అడిగినా ఇస్తార్లే అనే ధీమా కూడా వారిలో కనిపిస్తోంది. కానీ ఆ ధీమాతో వచ్చిన ఛాన్స్ ల్ని కూడా పోగొట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా ఇద్దరు హీరోయిన్స్ ఆ రకంగా మూవీ ఛాన్సులు పోగొట్టుకున్నారట.

బాహుబ‌లి తో భారీ విజ‌యాన్ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు సుజీత్ డైరెక్షన్ లో సాహో అనే మూవీ చేస్తున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఒకరిద్దరిని కాంటాక్ట్ చేస్తే హై రెమ్యునరేషన్ అడిగి ప్రొడ్యూసర్స్ కు చుక్కులు చూపించారట.

ముందుగా శ్రద్ధా కపూర్ ను .. దిశా పటానిని సంప్రదించారట సాహో నిర్మాతలు. ఈ సినిమా చేయడానికి శ్రద్ధా కపూర్ 8 కోట్ల వరకూ డిమాండ్ చేస్తే, దిశా పటాని 5 కోట్ల వరకూ అడిగిందట. వాళ్లకి అంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇష్టంలేని నిర్మాతలు వెనక్కు తగ్గారని చెబుతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ను .. కృతి సనన్ ను సంప్రదిస్తున్నారట. ఇక వాళ్లేమంటారో చూడాలి.

4033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS