స్టైలిష్ స్టార్ కి స్వల్ప విరామం.. 2 రోజుల్లో ఇంపాక్ట్ గిఫ్ట్

Sat,December 30, 2017 04:45 PM
short break for bunny movie

నూతన సంవత్సరం కానుకగా బన్నీతన అభిమానులకి స్టైలిష్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. జనవరి 1న ‘ఫస్ట్ ఇంపాక్ట్’ టీజర్ను విడుదల చేయనున్నట్లు బన్నీ రీసెంట్ గా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. 1 నిమిషం 20 సెకన్ల నిడివితో రూపొందిన వీడియోలో ఆయన గత చిత్రాల కంటే భిన్నంగా కనిపిస్తారని చిత్ర బృందం చెబుతుంది. బన్నీ తాజా చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య చిత్రంలో అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. 2018 ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ చిత్రం కోసం బన్నీ తన మేకొవర్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అయితే న్యూ ఇయర్ సందర్భంగా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి జనవరి 4 నుండి యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటాడట మన స్టైలిష్ స్టార్. ఈ గ్యాప్ లో కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్ వేస్తాడని టాక్. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. దేశభక్తి నైపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.


2369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS