క‌ర్ణాట‌క సీఎం స‌తీమ‌ణి మూవీ టైటిల్ ఫిక్స్

Wed,November 14, 2018 09:55 AM
Shooting starts for Radhika Kumaraswamy Damayanti

క‌ర్ణాట‌క సీఎం హెచ్‌డీ కుమార స్వామి రెండో భార్య రాధిక న‌టి అన్న సంగతి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టబోతుంది. న‌వ‌ర‌స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌ర‌ర్ కామెడీ సినిమా చేయ‌నుండ‌గా ఈ చిత్రానికి ద‌మ‌యంతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. న‌వంబ‌ర్ 12న సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం 1980 సంవ‌త్స‌రం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ట‌. నిర్మా త విశాల్ తండ్రి జీకె రెడ్డి చిత్రంలో రాధిక తండ్రిగా క‌నిపించ‌నున్నాడు. క‌న్న‌డలో రూపొందుతున్న ఈ మూవీని తెలుగులోను డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. సాధుకోకిల, తబలా నాని, విజయ్ చందూర్, కెంపేగౌడ్, పవన్, కార్తిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద‌మ‌యంతి చిత్రం త‌ర్వాత రాధిక భైర‌దేవి అనే సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. . శ్రీజై దర్శకత్వం వహించే ఈ సినిమాలో రమేష్ అరవింద్ మేల్ లీడ్ రోల్ పోషించబోతున్నారు.

2550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles