యంగ్ లుక్‌లో ర‌వితేజ‌.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

Sat,August 24, 2019 10:13 AM
Shocking look of  Ravi teja

మాస్ మ‌హారాజా ర‌వితేజ షాకింగ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. త్వ‌ర‌లో పూర్తి లుక్ విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అన్నారు. అయితే చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, తాజాగా యంగ్ లుక్ ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఇందులో ర‌వితేజని చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

2851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles