8న నటి శోభన నృత్యప్రదర్శన

Sun,September 2, 2018 06:44 AM
shobhana to participates dance performance for kerala victims

బంజారాహిల్స్ : కేరళలోని వరద బాధితులను ఆదుకునేందుకు నిధుల సమీకరణలో భాగంగా ప్రముఖ నటి, పద్మశ్రీ శోభన చేత ట్రాన్స్ పేరుతో ప్రత్యేక నృత్య ప్రదర్శన సెప్టెంబర్ 8న నిర్వహించనున్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నృత్యప్రదర్శన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. సంప్రదాయ, నృత్య మేళవింపుతో హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో మొట్టమొదటి సారిగా నిర్వహించనున్న నృత్యప్రదర్శన ద్వారా వచ్చే నిధులను వరద భాధితులకు సాయం అందిస్తారని నటుడు నవదీప్ తెలిపారు.

954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles