రాహుల్ సిప్లిగంజ్ స‌ర‌స‌న రాజ‌శేఖ‌ర్ కూతురు..!

Sat,December 14, 2019 12:02 PM

నిన్న‌, మొన్న‌టివ‌ర‌కు త‌న గ‌ళంతో సంగీత‌ప్రియుల‌ని ఉర్రూత‌లూగించిన రాహుల్ సిప్లిగంజ్ స్టార్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న‌ ‘రంగమార్తాండ’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చిత్రంలో రాహుల్ పాత్ర సినిమాకి చాలా కీల‌కంగా ఉంటుంద‌ని అన్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇదే చిత్రంలో రాహుల్ స‌ర‌స‌న రాజ‌శేఖ‌ర్ త‌న‌య, దొర‌సాని ఫేం శివాత్మిక న‌టిస్తుంద‌ట‌. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించినట్టు చెబుతున్నారు. ఈ విష‌యంపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. బిగ్ బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ ట్రోఫీ అందుకున్న త‌ర్వాత రాహుల్‌కి సింగ‌ర్‌గానే కాదు, న‌టుడిగా కూడా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.


‘రంగమార్తాండ’ చిత్రం మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. చిత్రంలో బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయన రోల్ హృద‌యాల‌ని పిండేసేలా ఉంటుంద‌ట‌. ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు.

2314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles